ప్రేమంటే చిరుగాలి అలల మీద చిరునవ్వుల గాయం
రాత్రి పగలు మరచి నిద్రాహారాలు విడచి దీక్షగా శిక్షగా రాసుకున్న గాథ
******************
నీవు తలచుకుంటే నీ జ్ఞాపకాన్ని నేను
నీవు మలచుకుంటే నీ రూపాన్ని నేను
నీవు ఆలపించుకుంటే నీ రాగాన్ని నేను
నీవు ఆనందిస్తే నీ హాసాన్ని నేను
నీవు రాసుకుంటే నీ భావాన్ని నేను
నీవు రమ్మంటే నీ దాసుడిని నేను
నీవు ఇమ్మంటే నీ ప్రాణాన్ని నేను
నీవు మరచిపోతే నీ స్మృతిని నేను
********************
ప్రియా...
నీలిమేఘాల చాటునుంచి శరత్పూర్ణిమల నాటి జాబిలమ్మ కొద్ది కొద్దిగా కనిపిస్తే నీ తొలిచూపు జ్ఞాపకం
నీరెండ పది లేఆకు మీద మంచు బిందువు మెరిస్తే నీ నవ్వు జ్ఞాపకం
అల్లరి తుమ్మెద అలవోకగా పువ్వు పై వాలితే నీ ముద్దు జ్ఞాపకం
సంధ్య కళ పిల్లగాలి హాయిగొలిపితే నీ స్పర్శ జ్ఞాపకం
పాలబుగ్గల పసివాడు అమ్మ ఒడిలో ముద్దు గా ఒదిగితే నీ ప్రేమ జ్ఞాపకం
**********************
నేనొక మౌన ముద్రలో ఉన్న అజ్ఞాత వర్తకుడను
ఎన్ని మంచు తెరలు తొలగించి వేకువ వెలుగును చూసానో
వసంతం లో ఎండి మ్రోడైన చేట్లేన్నింటిని కన్నానో
ఎన్ని అగ్నిపర్వతాల గుండె చప్పుళ్ళు విన్నానో
శిధిల సామ్రాజ్యాల ఆక్రన్దనలేన్నింటిని ఆలకి
No comments:
Post a Comment